Header Banner

ఉగ్రలింకుల కేసులో కీలక పరిణామం..! నిందితుల ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి!

  Thu May 22, 2025 22:30        India

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేళుల్లు జరిపేందుకు ప్రయత్నించిన విజయనగరానికి చెందిన చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌తో పాటు సికింద్రాబాద్‌లోని బోయిగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే వీరికి అంతర్జాతీయ స్థాయిలోని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా లభించిన ఆధారాల ప్రకారం ఆ ఇద్దరూ అల్‌ హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ సంస్థకు చెందిన వారిగా పోలీసులు కనిపెట్టారు.

పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు..

ఇక ఈ ఇద్దరికి ఉన్న సంబంధాలపై లోతైన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. వీళ్లు చిన్నప్పటి నుంచే ఉగ్రవాదంపై మక్కువతో ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీళ్ల పని భారత్‌ను ఇస్లామిక్‌ దేశంగా మార్చెయ్యడం. బాంబులు పెట్టి ముస్లిమేతరులను హతమార్చాలి. ఇదే సిరాజ్‌, సమీర్‌ల జీవితాశయం. ఒళ్లంతా ఉగ్ర విషం నింపుకున్న వాళ్లిద్దరికి నిరంతరం ఇవే ఆలోచనలు, ప్రణాళికలు వేస్తుండేవారట. విజయనగరానికి చెందిన సిరాజ్‌, హైదరాబాద్‌లో ఉండే సమీర్‌ 24 గంటలు ఇదే మాట్లాడుకునేవాళ్లట. ముస్లిమేతరులను ఎలా అంతమొందించాలి అనేదే లక్ష్యంగా పెట్టుకుని వీళ్లు పనిచేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఉప్పా యాక్ట్‌ కింద వీరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

నిందితులకు వారం రోజుల కస్టడీ విధింపు…

ఇక కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్‌లను వారం రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అనుమతించాలని కోరగా న్యాయస్థానం దానికి అనుమతించింది.ఈ మేరకు కేసులో నిందితులుగా ఉన్న ఏ1 సిరాజ్, ఏ2 సమీర్‌లను న్యాయస్థానం వారం రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. కోర్టు అనుమతితో ప్రస్తుతం విశాఖ సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విజయనగరం తరలించనున్నారు. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్య పరీక్షల తర్వాత కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. అయితే కస్టడీలో నిందితులపై ఎలాంటి థర్డ్‌ డిగ్రీ వంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు షరతులు విధించింది. కస్టడీ ముగిసిన తరువాత నిందితులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి పోలీస్‌ కస్టడీలో సిరాజ్‌, సమీర్‌లు ఎలాంటి కీలక విషయాలు బయటపెడతారో చూడాలి.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #TerrorLinksCase #CourtCustody #BreakingNews #IndiaSecurity #NIAInvestigation #TerrorAccused